కుళ్లిన స్థితిలో’మీర్జాపూర్’ నటుడి మృతదేహం.. అసలేం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ‘సూపర్ 30’, ‘దంగల్’, ‘మీర్జాపూర్’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సోవాలోని సోసైటీలో అద్దెకుంటున్న గదిలో అతని కుళ్లిపోయిన మృతదేహం లభ్యమవ్వడం కలకాలంగా మారింది. మీర్జాపూర్ చిత్రంలో మున్నా భాయ్ కి అనుచరుడిగా నవ్వులు పండించి మంచి పేరుతెచ్చుకున్నారు బ్రహ్మ స్వరూప్ మిశ్రా.. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. బుధవారం అతను ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గది తలుపులు తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో బ్రహ్మ స్వరూప్ మిశ్రా మృతదేహం లభ్యమయ్యింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా గుండెపోటుతో మరణించాడని, రూమ్ లో ఒక్కడే ఉండడంతో ఎవరికి ఈ విషయం తెలియలేదని, దాదాపు మూడురోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!