“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” భారీ విజయాన్ని సాధించింది. ఈ షో ఎండింగ్ లో హోస్ట్ నాగార్జున సీజన్ 6 గురించి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా “బిగ్ బాస్” తదుపరి సీజన్ టెలివిజన్‌తో పాటు డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రసారం కావడంతో డిజిటల్‌గా మారుతుందని ప్రకటించారు. షోకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ 24X7 ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘బిగ్ బాస్’ ప్రేమికులు ఈ సరికొత్త సీజన్ ను మొబైల్‌లు, టాబ్లెట్‌లలో కూడా చూడవచ్చు. అయితే గత ఎపిసోడ్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే ఈ కొత్త సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ షోను నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను నియమించాలని షో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆహా’లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ షోతో హోస్ట్ గా బాలయ్య తన అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపితే, నాగార్జున షో నుండి తప్పుకునే అవకాశం ఉంది. టాలీవుడ్ కింగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని, తన షెడ్యూల్ మధ్య ఈ కొత్త ‘బిగ్ బాస్’ను హోస్ట్ చేయలేకపోవచ్చు అని అంటున్నారు. కాగా “బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1” 2022 ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. బిగ్ బాస్ ఓటిటి కోసం షో మేకర్స్ ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6ని ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.