Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిని ఒకరో అర్ధం చేసుకుంటున్నాం అంటూనే ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుతున్నారు. నిజం చెప్పాలంటే అన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎంటర్ టైన్మెంట్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. జబర్దస్త్ కమెడియన్స్ చలాకీ చంటి, ఫైమా లాంటి వారు ఉన్నా హౌస్ లో వినోదం కరువయ్యింది. ఇక ఈ వారం ఆ వినోదాన్ని జోడించాడు బిగ్ బాస్. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీమ్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టి బిగ్ బాస్ హోస్ ను విజిట్ చేశారు. ఇక ఈ జంట బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఆడిషన్స్ షురూ చేసింది. డైరెక్టర్స్ గా సుధీర్, కృతి.. వారికి ఒక్కో కాన్సెప్ట్ చెప్పి అలా నటించాలని కోరారు.
రేవంత్ మహేష్ బాబు పోకిరి డైలాగ్ చెప్పి మెప్పించగా గీతూ బుజ్జిగాడు ప్రభాస్ డైలాగ్ తో దుమ్ము రేపింది. ఇక మిగతా వారు తమ తమ వాయిస్ తో ఏదో ట్రై చేశారు. ఇక మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్జే సూర్య.. విజయ్ దేవరకొండ వాయిస్ తో అదరగొట్టేశాడు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడే చలాకీ చంటి చెంప పగలకొట్టాడు. అది చంటికి గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. ఇక ఒక్కసారిగా సూర్య చేసిన పనికి హౌస్ మేట్స్ తో పాటు సుధీర్, కృతి కూడా షాక్ అయ్యారు. ఆ తరువాత మరోసారి సూర్య, చంటి ని నిదానంగా కొట్టాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక చంటి మనస్తత్వం గురించి జబర్దస్త్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క మాట నెగెటివ్ గా అన్నా పడడు. ఎన్నోసార్లు దానివల్లనే స్టేజి మీద నుంచి దిగిపోయి వెళ్ళిపోయాడు. అలాంటి చంటి, సూర్య కొట్టిన దెబ్బను గుర్తుపెట్టుకుంటాడా..? లేక గేమ్ లో తగిలిందిలే అని సరిదిపెట్టుకుంటాడా..? అనేది చూడాలి.