Bigg Boss Fame Himaja along with 11 others arrested:హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం జిబి వెంచర్స్ లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు దాదాపు 11 మంది సినీ సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నటిగా పలు సినిమాలలో నటించి తర్వాత బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న హిమజ ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడులు నిర్వహించగా అక్కడ లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హిమజ, హేమ, నీలిమ, యాంకర్ ప్రవీణ, తేజు, పవిత్ర, రోహిణి వంటి వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Sreeleela: శ్రీ లీల ప్రేమలో పడిందా? ఇదేంటి ఇలా షాక్ ఇచ్చింది?
అది బిగ్ బాస్ ఫేమ్ హిమజ నివాసం అని తెలుస్తోంది. పక్కా సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం తో కలిసి దాడి నిర్వహించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దాదాపు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి పెద్ద ఎత్తున యువతీ యువకులు హాజరయ్యారని, సౌండ్ సిస్టంతో హడావిడి చేస్తుండడంతో స్థానికులు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు ఈ దాడి అనంతరం 15 లీటర్ల మద్యం, సౌండ్ సిస్టం సీజ్ చేశారని అంటున్నారు. ఇక ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.