Sreeleela Reveals her Relationship status: ’తెలుగు మూలాలు ఉన్నా కర్ణాటకలో సెటిలైన శ్రీ లీల ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించిన పెళ్లి సందD అనే సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్ పక్కన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో శ్రీ లీలకు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. తర్వాత ఆమె తెలుగులో చేసిన ధమాకా కూడా మంచి హిట్గా నిలిచింది. తర్వాత చేసిన స్కంద సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా భగవంత్ కేసరి సినిమా మంచి హిట్ అవడంతో ఆమె లెగ్గు పెడితే సినిమా హిట్టే అని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె చేతిలో దాదాపుగా అరడజనులకు పైగా సినిమా అవకాశాలు ఉన్నాయి. కొన్ని సినిమాలను డేట్స్ సర్దుబాటు చేయలేక కూడా వదిలేసుకుంటుంది అనే వాదన వినిపిస్తోంది.
Anu Emmanuel: అను చెయ్యేస్తే అస్సామే!
అఫీషియల్ గా, అనఫీషియల్ గా మొత్తంగా చూసుకుంటే దాదాపు ఒక డజన్ సినిమాల వరకు శ్రీ లీల ఖాతాలో ఉన్నట్టే. అయితే ఫ్యాన్స్ ని ఆకట్టుకునే క్రమంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ భామ యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇంస్టాగ్రామ్ లో చాట్ సెషన్ నిర్వహించగా అందులో పలు సమాధానాలు కూడా ఇచ్చింది, అందులో భాగంగానే బిగ్ బాస్ కి ఈ రోజు వస్తున్నారంటే ఆది కేశవ ప్రమోషన్స్ కోసం వస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇంతలోనే ఒక అభిమాని మీరు కమిటెడ్ ఆ అంటే ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అని అడిగితే దానికి ఆమె తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ఇక దానికి ఆమె సమాధానం ఇస్తూ అవును, నేను కమిటెడే కానీ, అది నా పనికి అంటూ చెప్పుకొచ్చింది.