Bigg Boss-9 : బిగ్ బాస్ సీజన్-9 రసాభాసాగా జరుగుతోంది. మొదటి వారం పూర్తయ్యే సరికి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. మిగిలిన వారు ఈ వారానికి సేవ్ అయిపోయారు. అయితే హౌస్ లో అందరి దృష్టి ఇప్పుడు సుమన్ శెట్టి మీదనే ఉంది. అతను మొదటి నుంచి చాలా మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. అందరూ గొడవలు పడుతున్నా సరే కామ్ గానే ఉంటున్నాడు. మొదట్లో అతను బిగ్ బాస్ కు సెట్ కాడేమో అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా బిగ్ బాస్ టాస్కులు, గేమ్స్ లను అర్థం చేసుకుంటున్న సుమన్.. ఆచితూచి ఆడుతున్నారు. పైగా బిహేవియర్ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆకట్టుకుంటున్నాయి.
Read Also : Mirai : ప్రభాస్ వాయిస్ ఓవర్ రహస్యాన్ని చెప్పిన డైరెక్టర్
అవతలి వ్యక్తి ఆవేశంతో ఊగిపోతున్నా సరే.. సుమన్ మాత్రం కామ్ గా పాయింట్లు మాట్లాడుతున్నాడు. దాంతో ఆడియెన్స్ దృష్టిలో పడుతున్నాడు సుమన్ శెట్టి. అందరిలోకి స్పెషల్ గా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. టైటిల్ విన్నర్ కావడం కన్నా.. నలుగురిని నొప్పించకుండా ఉండటమే తన ఉద్దేశం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ప్రేక్షకులకు కావాల్సింది కూడా ఇలాంటి వారే కదా. టైటిల్ మాత్రమే ముఖ్యం అనుకునే వారిని ప్రేక్షకులు పట్టించుకోరు. నలుగురితో కలిసిపోయే వ్యక్తిని.. నలుగురి గురించి పట్టుకునే వారికే ఓట్లు గుద్దుతారు. ఇప్పుడు సుమన్ పరిస్థితి ఇలాగే ఉంది. మనోడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఇలాగే మెచ్యూరిటీగా గేమ్ ఆడుతూ.. అందరినీ పట్టించుకుని ముందుకు వెళ్తే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఇతని ఆట రెండో వారంలో ఎలా ఉంటుందో.
Read Also : OG : సుజీత్ కు అగ్నిపరీక్ష.. పవన్ మీదే ఆశలు..