Gautham Krishna: బిగ్ బాస్ నుంచి రాకముందే హీరోగా ఛాన్స్ పట్టేసిన గౌతమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautham Krishna: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు లో తన ఆటతో అలరిస్తున్నాడు గౌతమ్ కృష్ణ. మొదటిసారి ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి అశ్వద్ధామ 2.ఓ అంటూ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ ఆట చూస్తుంటే.. టాప్ 5 లో ఉండేలా కనిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ కు వెళ్ళకముందు ఒక సినిమాలో హీరోగా నటించిన గౌతమ్.. హౌస్ నుంచి బయటికి రాకముందే మరో బంపర్ ఆఫర్ పట్టేశాడు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గౌతమ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పి.నవీన్ కుమార్ దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సతీష్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈయన గతంలో బట్టల రామస్వామి బయోపిక్కు అనే చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆర్.పి. పట్నాయక్ తో కాఫీ విత్ ఏ కిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి.
Yash: ఆ సినిమాకు రూ. 150కోట్లు డిమాండ్ చేసిన రాఖీ భాయ్.. ?
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ “గతంలో నేను నిర్మించిన రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకాశవీధుల్లో చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 7 షోతో మరింత పాపులర్ అయిన గౌతమ్ కృష్ణతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అతనికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. గౌతమ్ బిగ్‌బాస్ షో నుండి తిరిగి రాగానే చివరి షెడ్యూల్ పూర్తిచేస్తాం. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్ నుంచి కార్పోరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు అన్న ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిది. ఫ్యామిలీ మరియు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. త్వరలో ఫస్ట్‌లుక్ మరియు టీజర్‌ను విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో చిత్రాలు తీయాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని చెప్పారు. మరి ఈ సినిమాతో గౌతమ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!