Chalaki Chanti: బిగ్ బాస్ 6 త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ప్రోమోలను కూడా రిలీజ్ చేసిన మేకర్స్ ఈసారి భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనేది వీరే అంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈసారి జబర్దస్త్ నటుడు చలాకీ చంటి ఈ షోలో హంగామా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై చలాకీ చంటి స్పందించాడు. బిగ్ బాస్ కు వెళ్తున్నట్లు హింట్ కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ యాజమాన్యం తనను సంప్రదించారని, అయితే తాను రెండు విషయాలను వారితో చర్చించానని చెప్పుకొచ్చాడు. వాటికి వారు ఒప్పుకొంటే వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలిపాడు. అయితే చంటి అడిగిన ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఒకటి రెమ్యూనిరేషన్ గురించి, ఇంకొకటి పర్సనల్ విషయమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతేడాది ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో హల్చల్ చేశాడు. జబర్దస్త్ నుంచి బయటికి రావాలి అంటే కొద్దిగా కష్టం తో కూడుకున్న పని అని చెప్పిన అవినాష్ .. కొంత డబ్బును ఇచ్చి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు చంటి ఎలా వస్తాడు అనేది తెలియాల్సి ఉంది.