రోజురోజుకు కరోనా చాపకింద నీరులా పాకుతోంది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పాడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్ గా బయటికొచ్చిన సిరి హన్మంతు.. షన్నుతో రిలేషన్ లో ఉంది అనే రూమర్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. వారిద్దరూ తాము మంచి స్నేహితులమని చెప్పుకుంటున్నా వారిమధ్య ఏదో ఉందన్న వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఇక సిరి కరోనా బారిన పడడంతో షన్ను పరిస్థితి ఏంటి అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇటీవల సిరిని, షణ్ముఖ్ కలిశాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కలిస్తే షన్నుకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని షన్ను అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే సిరి వలనే దీప్తి- షన్ను విడిపోయారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో వారి బ్రేకప్ కి కారణం నేను కాదని తేల్చి చెప్పింది సిరి. మరోపక్క సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా సిరిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ వలన రెండు జంటలు విడిపోయే పరిస్థితి వచ్చింది అంటూ నెటిజెన్స్ వాపోతున్నారు.