పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్. మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించిన ‘భీమ్లా నాయక్’ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా “భీమ్లా నాయక్” హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
Read Also : RGV : హే పవన్ కాబోయే పీఎం చెప్తున్నాడు విను… సీన్ లోకి కేఏ పాల్
ఈ ట్రైలర్ దాదాపుగా తెలుగు ట్రైలర్ లాగే ఉన్నా, డైలాగులు హిందీలో ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాలను మాత్రం చేంజ్ చేసి హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకేముంది ఈ హిందీ ట్రైలర్ ను షేర్ చేస్తూ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా “భీమ్లా నాయక్” హిందీ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి !