పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊర మాస్ అవతారంలో కన్పించి మెగా అభిమానులకు కిక్కెక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ తో ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన వీడియోగా నిలిచింది. అయితే “భీమ్లా నాయక్” “అలవైకుంఠపురంలో” సినిమాలకు మధ్య ఆసక్తికరమైన సంబంధం ఉంది. ఈ విషయం తెలిస్తే “అల వైకుంఠపురంలో” దారిలో “భీమ్లా నాయక్” నడుస్తున్నాడా ? అన్పించక మానదు.
Read Also : నేపాలీ బాల… మనీషా కొయిరాల…
అల్లు అర్జున్ “అల వైకుంఠపురము”లో “అల వైకుంఠపురము”లో ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ప్రకటన వీడియో 2019 ఆగస్టు 15న రిలీజ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఫస్ట్ గ్లింప్సె అండ్ టైటిల్ ప్రకటన ఆగస్టు 15న విడుదలైంది. యాదృచ్ఛికంగా “అల వైకుంఠపురము”లో జనవరి 12న విడుదలైంది. అలాగే “భీమ్లా నాయక్” చిత్రం కూడా జనవరి 12న విడుదలవుతోంది. మెగా అభిమానులు ఇప్పుడు జనవరి 12న విడుదలవుతున్న “భీమ్లా నాయక్” చిత్రం కూడా 2019లో అదే రోజున విడుదలైన “అల వైకుంఠపురము”లో లాగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు.