Bhairavam : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ భైరవం. మే 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు పెంచేశారు. హీరోలు ముగ్గురూ థియేటర్లలకు వెళ్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురూ విజయవాడలోని అలంకార్ థియేటర్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడారు. తమ సినిమాను ఆదరించిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.
Read Also : Virat Kohli : ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
మనోజ్ మాట్లాడుతూ.. మా సినిమాను ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. త్వరలోనే నా సుందరకాండ మూవీ కూడా వస్తుంది. దాన్ని కూడా ఆదరిస్తారిన ఆశిస్తున్నాను. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. త్వరలోనే పవన్ కల్యాణ్ అన్న సినిమా కూడా వస్తుంది. ఆ మూవీ వచ్చే వరకు మా సినిమా హౌస్ ఫుల్ చేయండి’ అని కోరాడు. ఈ ముగ్గురికి చాలా ఏళ్ల తర్వాత మంచి హిట్ పడింది.
ఈ సినిమాతో మనోజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. ఆయనకు ఏడేళ్ల తర్వాత మంచి హిట్ పడింది. అలాగే నారా రోహిత్ కూడా ఈ మూవీతో స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు చాలా ఏళ్ల తర్వాత హిట్ దక్కింది. వీరి పర్ఫార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ పర్ఫార్మెన్స్ తో ముగ్గురూ ఆకట్టుకున్నారు.
Read Also : Surekha Vani : పొట్టిబట్టలు వేసుకోవడంపై సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్..