Abhimanyu Dassani and Shreya Dhanwanthary dating: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తనయుడు, అభిమన్యు దాసాని ఒక తెలుగమ్మాయి ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న నౌసిఖియే విడుదలకు సిద్ధమవుతుండగా అభిమన్యు డేటింగ్ గురించి కొన్ని వార్తలు తెర మీదకు వస్తున్నాయి. అభిమన్యు తన సహనటి శ్రేయా ధన్వంతరితో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. నౌసిఖియే సెట్స్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఒక మీడియా పోర్టల్ కథనం ప్రకారం, భోపాల్‌లో ఈ చిత్ర షూటింగ్ సమయంలో అభిమన్యు -శ్రేయ ఒకరినొకరు ఆకర్షితులు అయ్యారని అంటున్నారు. వారిద్దరూ తమ రిలేషన్ షిప్ స్టేటస్‌ను ఇంకా ధృవీకరించనప్పటికీ, వారి రిలేషన్ గురించి అనేక వార్తలు తెర మీదకు వస్తున్నాయి. అభిమన్యు దస్సాని – శ్రేయా ధన్వంతరి భోపాల్‌లో నౌసిఖియే కోసం షూట్ లో పాల్గొన్నారు. ఏకంగా వారు ఒక నెల పాటు అక్కడే ఉన్నారని, ఆ నెల రోజుల షెడ్యూల్‌లో, ఇద్దరూ సన్నిహితంగా మారారని అంటున్నారు.
Panjagutta SaiBaba Temple: ఈ గుడిలో అనుకున్నవి జరిగితీరుతాయి, ఉచిత వైద్యం కూడా!
అభిమన్యు -శ్రేయ తమ రిలేషన్ గురించి చాలా సీరియస్‌గా ఉన్నారని కూడా అంటున్నారు. ఇకభాగ్యశ్రీ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమే ఆమె ఈ మధ్య ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ లో ఆయన తల్లి పాత్రలో మెరిసింది. ఇక జోష్ సినిమాలో ఒక చిన్న పాత్రలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యే పనిలో ఉంది. ఇక అభిమన్యు దస్సాని, 2018 యాక్షన్ కామెడీ మర్ద్ కో దర్ద్ నహీ హోతాతో బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. రాధిక మదన్, గుల్షన్ దేవయ్య, మహేష్ మంజ్రేకర్ నటించిన ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించగా థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఇక అభిమన్యు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మీనాక్షి సుందరేశ్వరన్ లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రేయా ధన్వంతరి చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, వై చీట్ ఇండియా వంటి హిందీ సినిమాలతో ఆమె తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుంది. 34 ఏళ్ల అతను స్కామ్ 1992, అన్‌పాజ్డ్: నయా సఫర్, ది ఫ్యామిలీ మ్యాన్, ముంబై డైరీస్ 26/11తో సహా పలు విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.