తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి జరుపుకుంటారు, దాన్ని వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసమహాముని పుట్టిన రోజు కావడంతో ఈ రోజుకూ అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును సత్కరిస్తూ అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇక భారీ వర్షాలు కురుస్తున్నా అవేమీ లెక్కచేయకుండా తెల్లవారుజామునుంచే అనేక ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. మహారాష్ట్ర షిరిడిలోని సాయిబాబా ఆలయంలో కూడా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే , పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా భక్తి టీవీ చేస్తున్న వీలాగ్స్ లోని తరువాతి ఎపిసోడ్ లో పంజాగుట్ట సాయిబాబా ఆలయంను కవర్ చేశారు.
Saibaba: గురు పూర్ణిమ నాడు శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే మీ మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి
ఈ క్రమంలో ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. నిజానికి హైదరాబాద్ లోని పంజాగుట్ట ద్వారకా పురి కాలనీలో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో బాబాకు నిత్యం షిర్డీలో జరిగినట్టే సేజ్ హారతి మొదలు కాకడ హారతి వరకు, చందనోత్సవం మొదలు అన్ని రోజు వారి దినచర్యలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు దర్శనం చేసుకునేలా ఇక్కడ సేవలు ఉంటాయి. ప్రతి గురువారం పల్లకి సేవ ద్వారకా పురి కాలనీ నుంచి హిందీ కాలనీ వరకు జరుగుతుంది. పల్లకి సేవలో అనేక మంది భక్తులు పాల్గొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామ స్మరణలో మునిగి తేలుతారు, ఈ ఆలయం తరపున లాభాపేక్ష లేని ఆసుపత్రిని నడుపుతున్నారు, అనేకమంది డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య కన్సల్టేషన్ అందిస్తున్నారు. దానికి అనుబంధంగా ఫిజియోథెరపీ సెంటర్, పాథలాజికల్ సెంటర్, ఫ్రీ ఫార్మసీ కూడా ఉన్నాయి. మరి భక్తి టీవీ చేసిన ఈ వీడియో మీరు కూడా చూసేయండి మరి.