Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరిగింది.. ఆఫర్లొచ్చినా వదులుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Srinivas Talks About His Bad Days: తెలుగులో ఏడు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మే 12వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతంగా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు. తన కెరీర్‌లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. మొదటి సినిమా చేశాక తనకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయని.. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టాడు.
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పీపుల్స్ స్టార్
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి చాలా ఈజీగా వచ్చానని అందరూ అంటుంటారు. అది నిజమే, నా తండ్రి వల్లే సులభంగా పరిశ్రమలోకి వచ్చాను. కానీ.. ఆ తర్వాత నేను హార్డ్ వర్క్ చేయడం వల్లే, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. నా తొలి సినిమా అల్లుడు శీను మంచి విజయం సాధించింది. ఆ సినిమాను నిర్మించిన మా నాన్న, నాకెంతో సపోర్ట్ చేశారు. అయితే.. అందులో సమంత, తమన్నా నటించేందుకు అంత ఈజీగా ఒప్పుకోలేదు. నేను వారికి 5 నిమిషాల డ్యాన్స్, 5 నిమిషాల యాక్టింగ్, 5 నిమిషాల యాక్షన్ వీడియోల క్లిప్‌లను తీసి, ఒక డెమో వీడియో క్రియేట్ చేసి, వారికి పంపించాను. ఆ వీడియో క్లిప్స్ చైసిన తర్వాతే వాళ్లు అల్లుడు శీనులో నటించేందుకు ఓకే చెప్పారు’’ అని చెప్పుకొచ్చాడు.
ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలు(మార్కెట్ క్యాపిటల్ ప్రకారం)
ఆ సినిమా మంచి సక్సెస్ సాధించిందని, అయితే ఆ సమయంలోనే తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని శ్రీనివాస్ తెలిపాడు. తన తండ్రి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన 8 సినిమాలు బోల్తాకొట్టడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని అన్నాడు. దాంతో తనపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని.. ఆ ఒత్తిడి వల్లే తొలి సినిమా తర్వాత వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఏడాదిన్నర పాటు తాను ఇంట్లోనే కూర్చుండిపోయానన్నాడు. ఆ తర్వాత తాను తక్కువ బడ్జెట్‌లో రెండో సినిమా చేశానని, అనంతరం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేసిన జయ జానకి నాయక చిత్రంతో తాను అన్ని విధాలుగా నిలదొక్కుకున్నానని శ్రీనివాస్ వివరించాడు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..