OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Releases: ఈ వీకెండ్ డిజిటల్ స్క్రీన్లపై వినోదాల విందు పంచేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్, గుండెలను పిండేసే ఎమోషనల్ డ్రామాలు, రోమాంటిక్ థ్రిల్లర్లు, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ కథనాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాయి. పండగ చేసుకోబోయే కంటెంట్ అయితే ఈ వీకెండ్ మీ ముందు ఉన్నట్లే. ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు, సిరీస్ లు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనే వివరాల్లోకి వెళ్తే..
లస్ట్ స్టోరీస్ 3 (Lust Stories 3)
Netflix ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో మోస్ట్ అవేటెడ్ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఈ రోజే (2026 సెప్టెంబర్ 18) స్ట్రీమింగ్కు వచ్చేసింది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ లాంటి నలుగురు క్రేజీ దర్శకులు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో.. ఆధునిక కాలంలో మనుషుల మధ్య ఉండే శారీరక వాంఛలు, విభిన్నమైన ప్రేమానుబంధాల చుట్టూ సాగే నాలుగు విభిన్నమైన కథలు ఉన్నాయి. రియల్ లైఫ్ కపుల్ సిద్ధార్థ్ – అదితి రావు హైదరీలతో పాటు విజయ్ వర్మ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ బోల్డ్ ఎమోషనల్ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తొడక్కం (Thudakkam)
అడవి నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ అరంగేట్రం చేయగా, ఆశిష్ జో ఆంటోనీ ముఖ్య పాత్రలో కనిపించారు, అలాగే మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో అలరించారు. 2026 ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు JioHotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇరుముడి (Irumudi)
తండ్రీకూతుళ్ల మధ్య ఉండే గాఢమైన అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. రోజూ తాగి ఊగే తండ్రి త్రినాథ్, తన కూతురు మణికంఠ కోసం అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. ఈ మాల ధారణ సమయంలో నియమాల ప్రకారం ఎలాంటి హింసకు తావివ్వకూడదు. కానీ సరిగ్గా అదే సమయంలో తన గ్రామంలోని ఆడపిల్లలకు ప్రమాదం ఎదురైనప్పుడు, అతడు తన భక్తికి, బాధ్యతకు మధ్య ఎలా పోరాడాడు అనేదే అసలు కథ. రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2026 ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైంది. ఇది ప్రస్తుతం Netflix ఓటీటీ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రోజు (సెప్టెంబర్ 18) నుంచి అందుబాటులోకి వచ్చింది.
మోద రాత్రి (Modha Rathri)
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ కామెడీ డ్రామా ‘మోద రాత్రి’. పెళ్లి రాత్రి చుట్టూ జరిగే వినోదాత్మక సంఘటనలు, నవ్వులు పూయించే ట్విస్టులతో ఈ మూవీ సాగుతుంది. రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకోగా, నేడు Netflix లో డిజిటల్ ప్రీమియర్ అయింది.
రామ్ అండ్ లీల (Ram and Leela)
‘రామ్ అండ్ లీల’ అనేది రియో రాజ్, వర్తికా జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఇది థియేట్రికల్ రన్ ముగించుకుని నేడు (2026 సెప్టెంబర్ 18) Amazon Prime Video లో డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. రామచంద్రన్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీవితంలో 50 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిన రామ్ అనే యువకుడు, లోకల్ ట్రెయిన్లో లీల అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడటం చుట్టూ తిరుగుతుంది.
అంగీకారం (Angikaaram)
కోటపాడి జె. రాజేష్, సింధూరి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా ఇది. థియేట్రికల్ రన్ ముగించుకుని నేడు (2026 సెప్టెంబర్ 18) SunNXT లో డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. తేన్పాథియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చెన్నైలోని ఒక శానిటరీ వర్కర్ కొడుకు ‘ఆథిరన్’ జీవితం చుట్టూ తిరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైన అతని పేరును కొందరు రాజకీయ నాయకులు కుట్రపూరితంగా తొలగించడంతో.. అతను ఆ వివక్షపై కోర్టులో చేసే పోరాటంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!