Bellamkonda Srinivas:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ. ఇస్తున్నాడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇక హిందీ వెర్షన్ కు వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ అంత రేంజ్ కాకపోయినా.. పర్లేదు.. శ్రీనివాస్ కూడా ఛత్రపతిగా సెట్ అయ్యాడు అనే మార్క్ ను అయితే రాబట్టాడు కుర్ర హీరో. ఇక ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో శ్రీనివాస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.
Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
ఇక తన మొదటి సినిమాలోనే సమంత, తమన్నా లాంటి హీరోయిన్ల సరసన ఆడిపాడాడు. మొదటి సినిమాలోనే సమంత, తమన్నాతో యాక్ట్ చేయించాడు. కొత్త హీరోతో చేయడానికి వాళ్లు ఎలా ఒప్పుకున్నారు అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇన్నేళ్ల తరువాత ఆ ప్రశ్నకు బెల్లంబాబు సమాధానం చెప్పుకొచ్చాడు. “నేను డ్యాన్స్ బాగా చేస్తాను.. అందుకే నా డ్యాన్స్ స్కిల్స్ అన్నింటిని ఒక వీడియో రూపంలో చేసి.. సమంతకు,తమన్నాకు పంపాను. ఆ టాలెంట్ కు, అప్రోచ్ అయిన విధానానికి ఇంప్రెస్ అయి అల్లుడు శీను సినిమాలో నటించడానికి వాళ్లిద్దరూ ఒప్పుకున్నారు. ఇప్పటికీ వారు నాకు మంచి స్నేహితులు” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో బెల్లంబాబు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.