Bedurulanka 2012 Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. ఎన్నో ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆర్ఎక్స్ 100 తరువాత ఈ హీరో అంతటి విజయాన్ని అందుకున్నదే లేదు. ఇక అంత పెద్ద హిట్ కాకపోయినా ఒక యావరేజ్ టాక్ హిట్ ను అన్నా అందుకోవడానికి కార్తికేయ చాలానే కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన డీజే టిల్లు భామ నేహా శెట్టి నటిస్తోంది. 2012 లో యుగాంతం అవుతుందని వచ్చిన వార్త ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ లైన్ ను తీసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
Shahrukh Khan: షారుఖ్ వాచ్ ధర.. ఒక కుటుంబం బిందాస్ గా బతికేయొచ్చు
టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ట్విస్టులతో నింపేశాడు డైరెక్టర్. 2012 డిసెంబర్ 21 కి డెడ్ లైన్..ఆ తరువాత ఏం జరుగుతుంది? అంటూ టీవీలో యాంకర్ చెప్పడంతో టీజర్ మొదలయ్యింది. ఈ వార్త విన్నాకా బెదురులంక అనే గ్రామంలో జరిగిన వింతలు విడ్డురాలే ఈ కథగా తెలుస్తోంది. డైలాగ్స్ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ లో కార్తికేయ ఒక పక్క రొమాన్స్ ను ఇంకోపక్క యాక్షన్ ను చూపించాడు. ఈ భగవద్గీతలు బైబిల్లు వున్నవి పూజ చేసుకోవడానికి కాదురా.. యూజ్ చేసుకోవడానికి అంటూ చెప్పిన డైలాగ్.. ప్రజల్లో ఉన్న భయాన్ని తెలియజేస్తుంది. ప్రాణ భయంతో బతుకుతున్న ప్రజలను మభ్యపెట్టి డబ్బు గుంజాలనుకొనే అజయ్ ఘోష్, అతనికి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి హీరో చేసే ప్రయత్నాల మధ్య ప్రజలు బతికారా..? ఆ పుకారు వలన ఆ ఊరిలో పరిస్థితులు ఎలాంటివి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక పల్లెటూరు అమ్మాయిగా నేహా చక్కగా కుదిరింది. ఇక మణిశర్మ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ హిట్ అందుకుంటాడేమో చూడాలి.