Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తరువాత పఠాన్ తో భారీ హిట్ ను అందుకున్నాడు. కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక మంచి హిట్ లేదు. స్టార్ హీరోలు సైతం చేతులు ఎత్తేశారు.. ఇక ట్రోలర్స్ బాలీవుడ్ పతనం అని కామెంట్స్ చేస్తున్న సమయంలో పఠాన్ రంగంలోకి దిగాడు. షారుఖ్ ఖాన్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం మూడురోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇదే రికార్డ్ అనుకుంటే.. విడుదలైన 15 రోజుల్లో రూ. 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి బాద్షా పేరును చరిత్రలో లిఖించేలా చేసింది. బాలీవుడ్ బాద్షా.. పేరుకు తగ్గట్టే షారుఖ్ నిజంగానే బాద్షాలా ఉంటాడు. ఆయన ధరించే డ్రెస్ లు, వాచ్ లు, షూస్ అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపికే. ఇక కొడుకు ఆర్యన్ డ్రగ్ కేస్ తరువాత షారుఖ్ ఈ ఆడంబరాలకు దూరంగా ఉంటున్నాడు.. అంటే మీడియా ముందుకు ఎక్కువగా రావడం లేదని చెప్పొచ్చు.
Auto Ramprasad: ఆటో రామ్ ప్రసాద్ కు క్యాన్సర్.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు
ఇక పఠాన్ విజయం ఇచ్చిన ధీమాతో షారుఖ్ చాలా రోజుల తరువాత ఒక ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో అందరి లుక్ షారుఖ్ నగుమోము మీదకంటే అతని చేతికి పెట్టుకున్న వాచ్ మీద పడింది. నీలం రంగు సూట్ కు సూట్ అయ్యేలా నీలం రంగు వాచ్ తో ప్రత్యేక్షమయ్యాడు బాద్షా. దీంతో అరే ఆ వాచ్ భలే ఉందే.. దీని ధరయేంత ఉంటుందో ఒక్కసారి చేద్దామని ట్రై చేసి గూగుల్ సెర్చ్ చేసి అవాక్కయ్యారు. ఆ వాచ్ ధర అక్షరాలా రూ. 5 కోట్లు. ‘ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్’ బ్రాండ్ కు చెందిన వాచ్ ఇది. ఇక ఈ ధర చూశాక అభిమానులు.. బాద్షా అన్నాకా ఆ మాత్రం మైంటైన్ చేయకపోతే ఎలా అని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొందరు ఒక నిరుపేద కుటుంబం జీవితాంతం బతికేయగలదు ఆ డబ్బుతో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా బాలీవుడ్ లో అంత రేంజ్ ఉన్నా మొనగాడు బాద్షానే.. ఈ వాచ్ చూస్తేనే తెలుస్తోంది అంటూ చెప్పుకొస్తున్నారు.