కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఉదయం నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద హంగామా మొదలయ్యింది. ఇక కొన్ని కంపెనీలు అయితే బీస్ట్ సినిమా రిలీజ్ కారణంగా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి.ఈ నేపథ్యంలో బీస్ట్ మూవీ చూసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి.
బీస్ట్ సినిమా చూసినవారికి లీటర్ పెట్రోల్ ఉచితమంటూ విరుద్ నగర్‌లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్ థియేటర్లు ప్రకటించాయి. అయితే ఇందులో ఒక షరతు కూడా పెట్టారు. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికీ మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుందని తెలిపారు. దీంతో 5 టికెట్లు కొన్నవారు పెట్రోల్ పోయించుకోవడానికి క్యూ కట్టారు. ఇక ఈ రెండు థియేటర్లలో ఒక టికెట్ రూ. 500 కాగా.. మిగతా థియేటర్లలో రూ. ఉండడం గమనార్హం. ఇక మరోపక్క విజయ్ తండ్రి పెట్టిన పార్టీ మక్కళ్ ఇయ్యక్కం సభ్యులు కూడా బీస్ట్ సినిమా వారికీ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. దీంతో అభిమానులు బీస్ట్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఇకపోతే మరోపక్క ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.