Barrelakka files a case on rgv at Womens Commission: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య అన్నీ వివాదం అయ్యే అవకాశం ఉన్న సినిమాలే చేస్తున్నారు. అలా చేసిన వ్యూహం సినిమా రిలీజ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదు అయింది. బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె తరపున లాయర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు. స్టేట్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు.
Hanuman: హనుమాన్ నైజాం హక్కులు కొనేసిన మైత్రీ మూవీస్.. వామ్మో అంత పెట్టారా?
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బఱ్ఱె లెక్క కాస్త ఉంటుంది, బర్రెలు లక్క ఆమె మాట కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని పేర్కొన్నట్టు సదరు లాయర్ పేర్కొన్నారు. ఇలాంటి మాటలు రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని ఆయన అన్నారు. ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు వద్దు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతాం అని ఆయన హెచ్చరించారు.