Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: సాధారణంగా ఒక వివాదం వచ్చినప్పుడు సెలబ్రిటీలు కానీ, రాజకీయ నేతలు కానీ ఏం చేస్తారు.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే చూస్తారు. అందుకు తగ్గట్టు మాట్లాడి సెట్ చేస్తారు. కానీ, ఇక్కడ కూడా బాలయ్య స్టైల్ వేరు. ఒక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు మరో వివాదానికి తెరలేపుతాడు. ఒక వివాదం ముగిసిందో లేదో మరో వివాదం మొదలయ్యింది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ మాట తూలడం.. అది కాస్తా వైరల్ గా మారి అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేవరకు వెళ్ళింది. అక్కినేని వారసులు అఖిల్, నాగ చైతన్య సైతం ఈ విషయమై స్పందించారు. బాలయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేయడం కూడా జరిగింది.
Read Also: R Sridhar : అశ్విన్ అలా అనేసరికి షాకయ్యా: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
Also Read
ఇక తాజాగా ఈ వివాదంపై మొట్ట మొదటిసారి బాలయ్య స్పందించాడు. “ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లలాంటివారు.. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను.. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు.. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను” చెప్పుకొచ్చాడు.
Read Also: MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే
ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత ” నేను అంటే ఆయనకు చాలా ఇష్టం.. సొంత పిల్లలు కంటే ఎక్కువగా నన్నే చూసుకొనేవారు. ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేవారు.. ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒక్క మాట మారారు కొత్త చర్చకు దారితీసింది. సొంత పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అంటే అక్కినేని నాగార్జున కుటుంబం ఏఎన్నార్ ను పట్టించుకోలేదా..? సరిగ్గా చూసుకోలేదా..? బాలయ్య అన్న మాటలకు అర్ధం ఏంటి..? అంటూ నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఒక వివాదం ముగిసిపోయింది అనుకుంటే బాలయ్య మరోసారి మాట తూలి ఇంకో వివాదం తీసుకొచ్చాడే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..