Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara: తమిళ సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. కోలీవుడ్ తారల పొలిటికల్ ఎంట్రీలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా పాలిటిక్స్‌లోకి రాబోతున్నారని, 2031 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా ఈ రూమర్లపై ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ స్పందించి పూర్తి స్పష్టతనిచ్చారు.
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ అన్నదాన కార్యక్రమంలో విఘ్నేశ్ శివన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నయనతార పొలిటికల్ ఎంట్రీపై నేరుగా ప్రశ్నించారు. 2031 తమిళనాడు ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. విఘ్నేశ్ కూల్‌గా సమాధానమిస్తూ ఆ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టారు. “ప్రస్తుతం నయన్ పిల్లలతో గడపడాన్ని ఎంజాయ్ చేస్తోంది. మా ఆలోచనలన్నీ వాళ్ల పెంపకం చుట్టూనే తిరుగుతున్నాయి. ఫ్యామిలీ, కెరీర్.. ప్రస్తుతానికి ఈ రెండే మా ప్రయారిటీ. ఈ లైఫ్ మాకెంతో ప్రశాంతతను, సంతృప్తిని ఇస్తోంది” అంటూ ప్రస్తుతానికి రాజకీయాల ఆలోచనే లేదన్న సంకేతాలు ఇచ్చారు. నయన్ పాలిటిక్స్ వార్తలను తోసిపుచ్చుతూ విఘ్నేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!