నందమూరి నట సింహ బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాసరి పండగని ముందే తెస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చింది. తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంది. మార్నింగ్ షో నుంచి డీసెంట్ టాక్ బయటకి వచ్చింది, దీంతో వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయ్యింది. అది భగవంత్ కేసరి సెకండ్ డే కలెక్షన్స్ కి బూస్ట్ ఇచ్చింది. అన్ని సెంటర్స్ లో భగవంత్ కేసరి నిన్న ఈవెనింగ్ షో నుంచే గ్రోత్ చూసింది.
Read Also: Mahesh Babu: మూడు రోజుల్లో అందరికీ పండగ… మరి ఘట్టమనేని అభిమానుల సంగతేంటి?
మొదటి రోజు లియో సినిమా కారణంగా ఓపెనింగ్స్ లో కాస్త వెనకపడింది భగవంత్ కేసరి సినిమా. డే 1 వరల్డ్ వైడ్ గా 32.33 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసాడు బాలయ్య. క్లాష్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ ని బాలయ్య ఫుల్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. యుఎస్ మార్కెట్ లో కూడా భగవంత్ కేసరి సినిమా హాఫ్ మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. పండగ సెలవలు ఇంకా ఉన్నాయి కాబట్టి భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉంది. టాక్ బాగుంది కాబట్టి ఇప్పట్లో భగవంత్ కేసరి స్లో అయ్యే అవకాశమే కనిపించట్లేదు.
Read Also: Suriya: లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి… థానోస్ లాంటోడు రోలెక్స్