అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.. అవెంజర్స్ ఎండ్ గేమ్… మార్వెల్ సినిమాటిక్ వచ్చిన ఈ రెండు వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు డౌన్ ది లైన్ ‘వరల్డ్స్ బెస్ట్ సినిమా’ల లిస్టులో చేరిపోతాయి. సూపర్ హీరోస్ అందరినీ ఒక సినిమాలో చూపించి, వాళ్లందరికీ ఒకటే విలన్ ని పెట్టి చేసిన ఎండ్ గేమ్ సినిమా క్లైమాక్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ క్లైమాక్స్ లో థానోస్ కి అపోజిట్ గా సూపర్ హీరోలంతా ఫైట్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఆ రేంజ్ విజువల్ కనిపిస్తూ ఉంటుంది తెరపైన. సూపర్ హీరోలంతా ఒక ఫోర్స్ గా ఫార్మ్ అయ్యి థానోస్ కి వైకతిరేఖంగా పోరాడి అతన్ని అంతమొందిస్తారు. అందుకే వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ నెగటివ్ క్యారెక్టర్ గా థానోస్ నిలిచిపోయింది.
ఇండియన్ థానోస్ గా ఇప్పుడు సూర్య కనిపించబోతున్నాడు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా కనిపించిన సూర్య, ఒక స్ట్రాంగ్ విలన్ గా కనిపించాడు. కమల్ హాసన్, కార్తీ, ఫాహద్ ఫజిల్ vs సూర్య వార్ కి గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్న సమయంలో… సూర్యకి అపోజిట్ గా లియో దాస్ ని కూడా నిలబెట్టాడు లోకేష్ కనగరాజ్… అంటే కమల్, విజయ్, కార్తీ, ఫాహద్ ఒక టీమ్… వీళ్లందరికీ ఒకడే విలన్ గా థానోస్ నిలబడనున్నాడు. రోలెక్స్ ని పట్టుకోవడానికి, చంపడానికి ఈ హీరోలు ఏం చేస్తారు? వీళ్లని ఆపడానికి సూర్య అకా రోలెక్స్ ఏం చేస్తాడు అనేది విక్రమ్ 2 సినిమాలో హైలైట్ అవ్వనుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎండ్ గేమ్ లాంటి విక్రమ్ 2 సినిమాలో ఈ అందరూ కలిసి కనిపించనున్నారు. మరి ఈ రోలెక్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.