నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బాక్సాఫీస్ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం మనం చాలా సార్లు చూసాం. అలాంటి హిస్టరీని మరోసారి రిపీట్ చెయ్యడానికి, ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా చేసుకోని… నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’గా మారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలని మరింత పెంచుతూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీ జనవరి 11న ఓవర్సీస్ లో ప్రీమియర్ కానుంది. స్లోఖ ఎంటర్టైన్మెంట్స్ ‘వీర సింహా రెడ్డి’ సినిమాని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఓవర్సీస్ ప్రమోషన్స్ ని సాలిడ్ గా చేస్తున్న స్లోఖ ఎంటర్టైన్మెంట్స్ ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.
Read Also: Ustaad Bhagath Singh: ఫుల్ స్వింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీప్రొడక్షన్ వర్క్స్…
ప్రీబుకింగ్స్ సూపర్బ్ గా జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ బయటకి వచ్చిన వీర సింహా రెడ్డి కొత్త పోస్టర్ లో బాలయ్య ‘సుత్తి’ పట్టుకోని ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. ఈ కొత్త పోస్టర్ ని మైత్రీ మూవీ మేకర్స్ ‘వీరసింహుడి విజృంభణ’ అని కోట్ చేసి ట్వీట్ చేశారు. ఎలాంటి టెక్స్ట్ లేకుండా ఫుల్ లెంగ్త్ పోస్టర్ ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చెయ్యడంతో, జనవరి 12న దాదాపు అన్ని సెంటర్స్ లో ఈ కొత్త పోస్టర్ కటౌట్ రూపంలో కనిపించడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే వీర సింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ని జనవరి 6న ఒంగోల్ లో చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తే బాలయ్య ఒంగోల్ లో నందమూరి అభిమానుల మధ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి మాస్ డైలాగ్స్ చెప్తాడు. పర్మిషన్ రాకుంటే వీర సింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Read Also: Prabhas: కృతిసనన్‌తో లవ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిజం చెప్పేశారు!