నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బాక్సాఫీస్ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం మనం చాలా సార్లు చూసాం. అలాంటి హిస్టరీని మరోసారి రిపీట్ చెయ్యడానికి, ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా చేసుకోని… నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’గా మారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలని మరింత పెంచుతూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.…