రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ. ఆ జోనర్‌లో ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. అలాంటి నేపథ్య కథతో ఆయన చేసిన మరో సినిమా ‘వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి బ్యానర్‌పై నిర్మించారు.
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.…