Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Stars: టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల ఎన్బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే షూటింగ్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. చాలా కాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. పూర్తిగా కోలుకున్న తర్వాత ఓజీ 2 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యువ హీరో అఖిల్ అక్కినేని కూడా ఇటీవల గాయం కారణంగా లెనిన్ సినిమా షూటింగ్‌కు కొంతకాలం దూరమయ్యారు. ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో చేతికి గ్లాస్ గుచ్చుకుపోయిందని, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టిందని అఖిల్ స్వయంగా వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్లో రెండు సార్లు గాయపడ్డారు. ఒకసారి చేతికి గాయమవగా, తాజాగా చివరి షెడ్యూల్లో కంటికి గాయమైంది. దీంతో సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోకాలి గాయం గురించి కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఆయన కాలికి గాయమవగా, అనంతరం ఒకసారి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినప్పటికీ ఆ గాయం ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని, అదే కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇలా టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హీరోల ఆరోగ్యమే ముఖ్యమని సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..