Animal: అర్జున్ రెడ్డి మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదా అన్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal Arjan Vailly Song : అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘అర్జన్ వాయ్లీ’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట చూస్తుంటే ఈ డికేడ్ మొత్తానికి మోస్ట్ వైలెంట్ సాంగ్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. భూపిందర్ బబ్బల్ ఈ పాటను రాసి అతనే పాడగా మనన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇక సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా ఈ పాట ఉండబోతున్నట్టు వీడియో చూస్తే తెలుస్తోంది. ‘యానిమల్’ లోని ఈ కొత్త పాట మీకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ 3 నిమిషాల నిడివి గల పాట చాలా అద్భుతమైన రీతిలో చిత్రీకరించబడింది. ఈ చిత్రంలోని ఈ పాట ఇతర పాటల నుండి పూర్తిగా భిన్నంగా ఉంది, ఇందులో రణబీర్ కపూర్ భయానక లుక్ లో కనిపిస్తున్నాడు.
Pawan Kalyan – Mahesh Babu: మహేష్ బాబు కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్..?
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
పాటలో రౌడీ లుక్‌లో రణబీర్ కపూర్ శత్రువులను చంపుతున్న తీరు చూడాల్సిందే అన్నట్టుంది. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పవర్ ఫుల్ సాంగ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఈ పాటను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ వీడియోపై కామెంట్స్ కూడా వెల్లువెత్తాయి. ఇక ఈ పాటలో హీరో లుక్, పాటకి పెట్టిన టైటిల్ చూసి ఇదేంటి అర్జున్ రెడ్డి మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదా అన్న..అంటూ కొందరు దర్శకుడిని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీలు యానిమల్‌లో ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించనుండగా, రష్మిక మందన్న రణబీర్ ప్రియురాలిగా కనిపించనుంది. కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’కి దర్శకత్వం వహించగా, ఇది డిసెంబర్ 1 న థియేటర్లలో విడుదలవుతుంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!