సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడటంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన నియోజకవర్గంలోని ఒక చిన్నారికి సోకిన ప్రాణాపాయ వ్యాధి గురించి తెలుసుకున్న ఆయన, ఆ బాలుడిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం నియోజకవర్గం, లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ప్రస్తుతం ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన మరియు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. గత 21 నెలలుగా ఈ చిన్నారి మృత్యువుతో పోరాడుతున్నాడు.
Also Read:Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”
బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం, ఈ వ్యాధిని నయం చేసేందుకు ‘Zolgensma’ (Onasemnogene Abeparvovec) అనే ఇంజెక్షన్ అవసరం. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన ఇంజెక్షన్ కానీ దీని ధర అక్షరాలా ₹16 కోట్లు. ఈ మందు విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం ఆ సామాన్య కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. నిన్న హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణని బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పరిస్థితి చూసి చలించిన బాలయ్య తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తూనే, ప్రభుత్వ పరంగా కూడా ఆ మందును తెప్పించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. సామాన్య ప్రజలు, దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి, రూపాయి చిన్నదైనా సరే తమకు తోచిన సహాయం చేసి కేయాన్ష్ అడ్విక్‌ను కాపాడాలని ప్రేమపూర్వకంగా కోరారు.
సహాయం చేయాలనుకునే వారి కోసం అకౌంట్ వివరాలు:
**పేరు (Name):** A S Nataraj
> **ఖాతా సంఖ్య (Account):** 8265662545
> **IFSC కోడ్:** IDIB000J028
> **బ్యాంక్ బ్రాంచ్:** J P NAGAR (Indian Bank)
