Pawan Kalyan: సీనియర్ డైరెక్టర్ కె. వాసు నేటి సాయంత్రం మృతి చెందిన విషయం తెల్సిందే. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు కు ఆయనే దర్శకత్వం వహించారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక తాజాగా వాసు మృతి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ ను రిలీజ్ చేశాడు.
Vanitha Vijay Kumar: సొంతవాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు.. నా తండ్రే నన్ను
“దర్శకులు శ్రీ కె. వాసు గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణిప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి గారు ముఖ్య పాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకులుగా శ్రీ వాసు గారిని మరచిపోలేం. చిరంజీవి గారు తొలిసారి వెండి తెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు. శ్రీ కె.వాసు గారి సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైనది. తెలుగునాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. శ్రీ వాసు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ ఆయనతెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
శ్రీ కె.వాసు గారు ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/qWnqxE1jZb
— JanaSena Party (@JanaSenaParty) May 26, 2023