Babloo Prithiveeraj Gives Clarity About His Relationship With Sheetal: 57 సంవత్సరాల బబ్లూ పృథ్వీరాజ్.. 24 ఏళ్ల అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని కొన్నిరోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! భార్య నుంచి దూరంగా ఉంటున్న ఆయన.. ఓ మలేషియన్ అమ్మాయిని ప్రేమించి, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై తాజాగా పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు. తాను శీతల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవమే గానీ.. ఇంకా పెళ్లి చేసుకోలేదని లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ స్పష్టం చేశాడు. ఒక సంవత్సరం క్రితం తనకు శీతల్ పరిచయం అయ్యిందని.. అది స్నేహంగానూ, ఆ తర్వాత ప్రేమగానూ మారిందని తెలిపారు. తమ మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటంతో.. తమ ఫ్యామిలీ ఈవెంట్‌లో తనకు శీతల్‌లో పెళ్లి అయ్యిందని అబద్ధం ఆడానని, అక్కడి నుంచి తమకు పెళ్లైనట్టుగా వార్తలు వ్యాపించాయని అన్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న శీతల్.. తాను మలేషియన్ అమ్మాయిని కాదని తెలిపింది. తాను పక్కా తెలుగు అమ్మాయిని అని.. హైదరాబాద్‌లో పుట్టి, రాయలసీమలో పెరిగానని స్పష్టం చేసింది. తమకు బెంగళూరులో పరిచయం ఏర్పడిందని, అక్కడి నుంచే తమ ప్రేమాయణం మొదలైందని పేర్కొంది. అంతే తప్ప తానేం మలేషియనో, నేపాలినో, చైనా అమ్మాయినో కాదని చెప్పింది. అసలు తనకు మలేషియాతో ఎలాంటి కనెక్షన్ లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక తమ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌ని కూడా ప్రజలు వింతగా చూస్తున్నారని, నిజానికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెద్ద సమస్యే కాదన్నట్టుగా శీతల్ మాట్లాడింది. ఇక మధ్యలో పృథ్వీ అందుకొని.. చాలా సంవత్సరాల నుంచి తనకు, తన భార్య మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఆరు సంవత్సరాల నుంచి సెపరేట్ ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నానన్నాడు. ఒంటరితనం తనని ఎంతో భయానికి గురి చేసిందని, అయితే ఏడాది క్రితం పరిచయం అయిన శీతల్ తన జీవితంలోకి రావడంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.