Ayesha Khan : రోజూ రేప్ చేస్తామంటున్నారు.. నటి సెన్సేషనల్ కామెంట్స్
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవుతున్నారు కానీ, అదే సమయంలో కొంతమంది వికృత చేష్టల వల్ల నరకాన్ని కూడా చూస్తున్నారు. తాజాగా నటి ఆయేషా ఖాన్ తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఎదురవుతున్న రేప్ బెదిరింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా, ఒక నటిగా తను అనుభవిస్తున్న మానసిక వేదనను పంచుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా ఖాన్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె 12వ తరగతి చదువుతున్న సమయంలో ‘టీ-సిరీస్’ రూపొందించిన ఒక పాటలో సెకండ్ లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ, షూటింగ్ ప్రారంభానికి కేవలం ఒక్క రాత్రి ముందు.. ఆమె ‘బరువు ఎక్కువగా ఉంది’ అనే సాకుతో ఆ ప్రాజెక్ట్ నుండి తొలగించారట. ఆ చిన్న వయసులో అది తనపై ఎంతటి ప్రభావం చూపిందంటే.. మళ్ళీ తన రూపంపై తనకు నమ్మకం కలగడానికి చాలా ఏళ్లు పట్టిందని ఆమె ‘వీ ది ఉమెన్’ ఈవెంట్‌లో పేర్కొన్నారు.
Also Read
ప్రస్తుతం సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఆయేషా నిర్మొహమాటంగా మాట్లాడారు. “నేను సింపుల్ టాప్ వేసుకున్నా, స్కర్ట్ వేసుకున్నా.. జనం ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేస్తోంది. అందుకే ఏదైనా ఫోటో పోస్ట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. నా కామెంట్ బాక్స్‌లో అసభ్యకరమైన రాతలు చూస్తుంటే అసలు పోస్ట్ చేయడమే మానేయాలనిపిస్తుంది “ప్రతిరోజూ నాకు రేప్ బెదిరింపులు వస్తున్నాయి. నాతో ఏం చేయాలనుకుంటున్నారో నీచంగా రాస్తున్నారు. ఒకవేళ నేను సెలబ్రిటీని కాకపోయి ఉంటే, ఆ బెదిరింపులు నిజం అయిపోయేవేమో అని భయమేస్తోంది.” “ఈ బెదిరింపులకు అంత బలం ఉంటే వాళ్ళు ఇప్పటికే నేరగాళ్లుగా మారిపోయేవారు.
ఇవి కేవలం కామెంట్స్ కావు, ఇవి నా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను” అని ఆయేషా ఖాన్ స్పష్టం చేశారు. ఆయేషా ఖాన్ ఏక్తా కపూర్ నిర్మించిన ‘కసౌతీ జిందగీ కే’ సీరియల్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘బాల్వీర్ రిటర్న్స్’లో మెరిశారు. తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ చిత్రంలోని ‘స్పెషల్’ సాంగ్ ద్వారా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అన్న కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్న నెటిజన్ల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయేషా ఖాన్ ధైర్యంగా తన గళం వినిపించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Telangana Govt Key Decision: మార్చి 8న అసెంబ్లీలో భారీ మార్పులు..!
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్‌పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!