Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: తిరుపతి జిల్లా ముక్కాపారిపల్లెలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, కూటమి ప్రభుత్వ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం వారి రాజకీయ విధానంగా మారిందన్నారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు “మావిగన్” అంటూ కొత్త నినాదం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. “మావిగన్ అంటే ఏమిటో ఎవరికైనా అర్థమైందా?” అని ప్రశ్నించారు. అమరావతిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని, రాజధాని నిర్మాణ పనులు కేంద్ర సహకారంతో వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకొస్తామని ఇచ్చిన హామీని రెండేళ్లలోనే నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను తిరిగి పునరుద్ధరించామని, జల్ జీవన్ మిషన్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.28 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించామని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ యూనిట్, తిరుపతిలో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారీ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ఇక, రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, మదనపల్లిలో త్వరలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి భారీ పెట్టుబడులతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ ఇప్పటికే నెరవేర్చామని చెప్పడం లేదని, అయితే వాటి అమలుకు శుభారంభం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. “దేశం ముందు.. ఆ తర్వాత మనం” అనే స్ఫూర్తితో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్ ఇక “అన్‌స్టాపబుల్” అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!