Avatar 2 Creates New Record In India: విజువల్ వండర్‌గా వచ్చిన అవతార్-2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన హాలీవుడ్ సినిమాగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ ఎవేంజర్స్: ది ఎండ్‌గేమ్ సినిమా రూ.367 కోట్ల నెట్ వసూళ్లతో తొలిస్థానంలో ఉండేది. ఇప్పుడు అవతార్-2 సినిమా 368.20 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టింది. దీంతో.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో ఎవేంజర్స్: ది ఎండ్‌గేమ్ సినిమా రెండో స్థానానికి పడిపోయింది. అవతార్-2కి ఆశాజనకమైన రివ్యూలు రాకపోయినప్పటికీ.. ఇందులోని విజువల్స్ మెస్మరైజ్ చేయడంతో, ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరారు. అందుకే, ఇది రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Farmers Cricket Match: ఉత్సాహంగా రైతుల క్రికెట్ పోటీలు.. విజేతలు ఎవరంటే?
కేవలం ఇండియాలోనే కాదు.. విశ్వవ్యాప్తంగానూ అవతార్-2 సినిమా అద్దిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. గతేడాది డిసెంబర్ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా.. కేవలం 14 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయింది. దీంతో.. 2022లో ఈ మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న సినిమాగా అవతార్-2 నిలిచింది. ఈ చిత్రంతో పాటు టాప్ గన్: మావెరిక్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ కూడా 2022లో 1 బిలియన్ క్లబ్‌లో చేరాయి.
Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!