Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stone Attack On Singer Mangli Car In Bellary: ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీకి కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొని వస్తుండగా.. కొందరు దుండగులు ఆమె కారుపై రాళ్ల దాడికి దిగారు. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో మంగ్లీ అతిధిగా పాల్గొంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆమె తన కారులో తిరిగి బయలుదేరింది. అప్పుడు ఆమె కారుపై కొందరు రాళ్లతో దాడి చేశారు.
Kiren Rijiju: సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువా..? మోదీ డాక్యుమెంటరీపై కేంద్రమంత్రి
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
అయితే.. ఈ దాడి జరగడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ సింగర్ మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడ ప్రజల కోసం కన్నడలో ఏమైనా మాట్లాడాల్సిందిగా యాంకర్ అనుశ్రీ కోరింది. అయితే.. మంగ్లీ మాట్లాడలేదు. అందరికీ తెలుగు తెలుసు కదా అని, తెలుగులోనే మాట్లాడింది. అయినా యాంకర్ వదలకుండా బలవంతం చేయడంతో.. కన్నడలో మంగ్లీ ఒకట్రెండు మాట్లాడిందంతే! ఇది కన్నడ ప్రేక్షకులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు మంగ్లీ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
Bihar Car Accident: ఢిల్లీ తరహా మరో హారర్ ఘటన.. 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..
కన్నడ ఇండస్ట్రీలో మంగ్లీ అడుగుపెట్టి రెండేళ్లు అవుతోందని, అయినా ఆమెకు కన్నడ అర్థం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడికి వచ్చి కన్నడలో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆమెకు అవకాశాలు ఎందుకు ఇస్తారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ రాళ్ల దాడి వెనుక కారణం కూడా.. మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడమేనని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!