Avantika dassani: భాగ్యశ్రీ కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avantika dassani: బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయం అయిన ‘స్వాతి ముత్యం’ సినిమా గత వారం జనం ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అతని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికీ దర్శక నిర్మాతలు శ్రీకారం చుట్టారు. వినూత్న కథాంశంతో ‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నిర్మాత సతీష్ వర్మ. ఆయనే ఇప్పుడు బెల్లంకొండ గణేష్‌తో ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానరుపై రెండో సినిమాను నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా అలనాటి అందాల కథానాయిక, బాలీవుడ్ భామ భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతంలోనూ భాగ్యశ్రీ కొన్ని తెలుగు సినిమాలలో నటించి ఇక్కడి ప్రేక్షకుల మనసుల్ని చూరగొన్నారు. ‘నేను స్టూడెంట్ సార్’ అనే పేరుతో ఈ సినిమాను రాఖీ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్నారు. దీనికి దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.
Read Also: Organic farming: ప్రకాశ్ రాజ్‌తో సుభాష్ పాలేకర్ బయోపిక్!
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఇటీవలే ఈ చిత్రానికి సంబధించిన విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో గణేష్ టెర్రిఫిక్‌గా కనిపించారు. ఈ రోజు అవంతిక దస్సాని క్యారెక్టర్‌ను తెలియచేసే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో అవంతిక.. శృతి వాసుదేవన్ అనే కాలేజీ స్టూడెంట్ పాత్రను పోషిస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోదిని, రవి సాయితేజ తదితరులు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!