Rashmi: ప్రస్తుతం కామెడీ.. బూతు అయిపోయింది. వల్గర్ పంచ్ లు లేకపోతే కామెడీ అని అనిపించుకోవడం లేదు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై ప్రసారమయ్యే చాలా కామెడీ షోలు ఇలాంటి వల్గర్ పంచ్ లు లేకుండా కామెడీ చేయలేకపోతున్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ ను కుటుంబం సమేతంగా చూసేవారు. కానీ, ఇప్పుడు అందులో సగానికి సగం అడల్ట్ కంటెంట్ మాత్రమే వస్తుండడంతో పెద్దవారు.. ఈ కామెడీ షోను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అందులో కూడా మంచి కామెడీ చేసే ఆర్టిస్టులు సైతం కామెడీని పంచడానికి అడల్ట్ కంటెంట్ ను ఎంచుకోవడం బాధాకరంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాంప్రసాద్. ఆటో పంచ్ లతో మంచి కమెడియన్ గా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న రాంప్రసాద్ కొన్నిసార్లు వల్గర్ పంచ్ లు వేసి వివాదాలను కొనితెచ్చుకుంటాడు. గతంలో కూడా విష్ణుప్రియ బాడీపై, ముక్కుపై చాలాఅసభ్యకరంగా కామెంట్స్ చేసాడు. ఇక తాజాగా కొద్దిగా హద్దుమీరి రష్మీపై అడల్ట్ పంచ్ లు వేసి అభిమానుల చేత తిట్టించుకుంటున్నాడు.
Bro Pre Release Event: పోలీసుల హెచ్చరిక.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యం
ఇటీవల రష్మీ యాంకరింగ్ చేస్తున్న ఈవెంట్ కు రాంప్రసాద్ వచ్చాడు. ఆ ప్రోగ్రాం థీమ్ ను చెప్పడానికి మొదటనే రాంప్రసాద్ కనిపించి.. తన కలలోకి వచ్చిన అమ్మాయి ఎవరో కనిపెట్టాలని.. అందరిని పిలిచి ఈవెంట్ చేయాలనీ చెప్తాడు. ఇక అప్పుడే యాంకర్ రష్మీ స్టేజిమీదకు రావడంతో.. ఆమెను రాత్రికి వస్తావా అని డబుల్ మీనింగ్ లో మాట్లాడాడు. వెంటనే.. రష్మీ.. రాత్రికి ఎందుకు రమ్మంటున్నావ్ అని అనగానే.. రాత్రికి ఎందుకు రమ్మంటారో తెలియదా.. ? అంటూ ఒకరకంగా చూస్తాడు. ఇక అప్పుడే ఇంద్రజ వచ్చి ఏయ్… అనేసరికి వెంటనే తేరుకున్న ఆటో రాంప్రసాద్ ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ కవర్ చేస్తాడు. అప్పటికే అతను కవర్ చేసాడని అందరికి తెలిసిపోయింది. ప్రేక్షకులను నవ్వించడానికి.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలా.. ? ఇలాంటి అడల్ట్ జోక్స్ వేసి కామెడీ కి ఉన్న పరువు తీస్తున్నారు.. అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.