Bro Pre Release Event May start late Due to this reason: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా మామా -అల్లుళ్లు తొలిసారి కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం (జులై 25) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగాల్సి ఉంది, ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి పెద్ద సంఖ్యలో పవర్ స్టార్ అభిమానులు శిల్ప కళా వేదికకు వచ్చేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మేకర్స్ ఒక షాకింగ్ అనౌన్సమెంట్ చేశారు.
Baby: ‘బేబీ’నా మజాకా.. 11 రోజుల్లో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ బ్రేక్ చేసిందిగా!
అదేమంటే ఈరోజు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా గౌరవ పోలీసు శాఖ వారి సూచనల మేరకు అనుకున్న సమయానికన్నా ప్రీ రిలీజ్ వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. విచ్చేసే అభిమాన ప్రేక్షకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడకుండా టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలు వీక్షించగలరు అని మనవి చేస్తున్నామని అంటూ పవన్ కళ్యాణ్ పీఆర్వో ట్వీట్ చేశారు.
ఇక ఎనిమిదిన్నర నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతున్నట్టు కూడా ఒక ప్రకటన వచ్చింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ బ్రో మూవీ పవన్ సమయం అనే ఓ భిన్నమైన పాత్ర పోషించగా ఆయన ధరమ్ తేజ్ మార్కండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో నటించాడు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫిమేల్ లీడ్స్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ గత శుక్రవారం రిలీజైన విషయం తెలిసిందే.
'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక : నేటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా గౌరవ పోలీసు శాఖ వారి సూచనల మేరకు అనుకున్న సమాయానికన్నా వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. విచ్చేసే అభిమాన ప్రేక్షకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడకుండా టి వి ప్రత్యక్ష… pic.twitter.com/8uM00FU03V
— L.VENUGOPAL🌞 (@venupro) July 25, 2023