చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటలే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆర్నాల్డ్, అమెరికా మాజీ ప్రధాని జాన్ కెనెడీ కోడలు, జర్నలిస్ట్ శ్రివర్ ని వివాహమాడాడు. 35 ఏళ్ళ వీరి వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో వీరు పదేళ్ల క్రితమే విడాకులకు కోర్టులో అప్లై చేయగా.. వారికీ ఉన్న 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి కోర్టుకు పదేళ్ల సమయం పట్టింది.
ఇక వాదోపవాదనలు విన్న కోర్టు ఇటీవలే వారికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. యాక్షన్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తెలిపారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రస్తుతం ఆర్నాల్డ్ సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాడు.