Arjun Son Of Vyjayanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న మూవీ అర్జున్ s/o వైజయంతి. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తల్లి, కొడుకుల అనుబంధంను హైలెట్ చేస్తూ దీన్ని కట్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయిన వైజయంతి కొడుకు అర్జున్ క్రిమినల్ ఎందుకు అయ్యాడు.. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడు.. అనే సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్లు ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. ‘నీకు నాకు మధ్య ఉన్నది సముద్రం.. అది దాటి వస్తే నీ చావు సిద్ధం’ అనే పవర్ ఫుల్ డైలాగ్ ఇందులో కనిపించింది.
Read Also : Vijayashanthi : ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రామలక్ష్మణుల్లా ఉన్నారు : విజయశాంతి
విజయశాంతికి, కల్యాణ్ రామ్ కు మధ్య ఎమోషనల్ బాండింగ్ ను హైలెట్ చేశారు. తల్లి కోసం క్రిమినల్ నుంచి పోలీస్ ఆఫీసర్ గా కల్యాణ్ రామ్ మారడాన్ని ఇందులో హింట్ ఇచ్చి చూపించాడు దర్శకుడు. యాక్షన్, ఎమోషన్ తో పాటు తల్లి, కొడుకుల బంధాన్ని హైలెట్ గా చేసుకుని ట్రైలర్ ను నీట్ గా చూపించాడు. కానీ ట్రైలర్ లో సస్పెన్స్ మెయింటేన్ చేసి క్యూరియాసిటీని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ చూస్తుంటే రిచ్ లుక్ కనిపిస్తోంది. భారీగానే ఈ మూవీ కోసం ఖర్చు పెట్టారు. బీజీఎం కూడా బాగుంది. ఇందులో కల్యాణ్ రామ్ మాస్ లుక్ లో మెరిశాడు. పటాస్ తర్వాత మళ్లీ అలాంటి లుక్ ఇందులో కనిపిస్తోంది. ఎలివేషన్లు సీన్లు కూడా ఉన్నాయి. మరి ఈ యాక్షన్, ఎమోషన్ కలిసిన సినిమా ఎలా ఉంటుందో ఏప్రిల్ 18న థియేటర్లలో చూడాలి.