టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తరువాత అన్నట్లు చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘాటు రొమాన్స్, లిప్ కిస్సులు.. ఒక భగ్న ప్రేమికుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఇక ఈ సినిమా మరోసారి రిలీజ్ కానున్నదట. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు సందీప్ చెప్పడం విశేషం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి సినిమా మొత్తం కూడా 4 గంటల 20 నిమిషాలు వచ్చింది. కానీ.. రన్ టైమ్ అంత ఎక్కువ ఉంటే ప్రేక్షకులు చూడలేరని.. రా వెర్షన్ ను ఎడిట్ చేసి 3 గంటల 40 నిమిషాలకు కుదించాం.. అయితే అది కూడా రిలీజ్ చేయడం కష్టం కాబట్టి మరో 40 నిమిషాలు కుదించి చివరికి 3 గంటల సినిమాను రిలీజ్ చేశాం.
ఇక అర్జున్ రెడ్డి పూర్తయ్యి 5 ఏళ్లు కావస్తున్నా సందర్భంగా ఈ సినిమా రా వెర్షన్ మొత్తాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎడిట్ చేయకుండా సినిమా మొత్తాన్ని మరోసారి చూడొచ్చు” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అర్జున్ రెడ్డి అభిమానులు మరోసారి అసెంబుల్ అయ్యారు. ఇక ఈ రా వెర్షన్ లో రొమాన్స్ అంతకు మించి ఉండనున్నదట. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆ సీన్ లలో మరింత రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇక దీంతో అర్జున్ రెడ్డి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ..? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.