2023 సంక్రాంతికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ వీర సింహా రెడ్డిగా ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలయ్య, దసరాకి తెలంగాణ ముద్దు బిడ్డ భగవంత్ కేసరిగా రాబోతున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పక్కన మొదటిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా బాలయ్యకి కూతురి పాత్రలో నటిస్తోంది. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ మాస్… రెండు ఎలిమెంట్స్ ఉండేలా రూపొందిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానుంది. బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ విలన్ ఉండాల్సిందే. ముఖేష్ రిషీ, జయప్రకాశ్ రెడ్డి, జగపతి బాబు, శ్రీకాంత్, దునియా విజయ్… వీళ్లంతా బాలయ్యకి ఆపోజిట్ గా బలమైన విలన్స్ గా నటించిన వాళ్లే.
Read Also: Bigg Boss 7 Telugu: ‘తొక్కలో సంచాలక్..బొక్కలో తీర్పు ‘.. అమర్ పరువుతీసిన నాగ్..
భగవంత్ కేసరి సినిమాలో కూడా అదే రేంజ్ విలనిజం చూపించడానికి రెడీ అయ్యాడు బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్. డాన్, ఓం శాంతి ఓం, రాజనీతి, D-డే, సత్యాగ్రహ లాంటి సినిమాల్లో అర్జున్ రాంపాల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. భగవంత్ కేసరి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న అర్జున్ రాంపాల్ “రాహుల్ సంఘ్వీ”గా కనిపించబోతున్నాడు. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అర్జున్ రాంపాల్ చాలా స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నాడు. మరి బాలయ్య vs అర్జున్ రాంపాల్ ఆన్ స్క్రీన్ వార్ ఎలా ఉండబోతుంది? అనీల్ రావిపూడి ఈ హీరో-విలన్ ట్రాక్ ని ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలి అంటే దసరా వరకూ ఆగాల్సిందే.
Introducing the National Award-Winning Actor @rampalarjun as the menacing #RahulSanghvi from #BhagavanthKesari 🔥
TRAILER TOMORROW @ 8:16 PM ❤️🔥
Massive Release Worldwide on October 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman… pic.twitter.com/mT6nh4LY12
— Shine Screens (@Shine_Screens) October 7, 2023