‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ లో మాములుగా లేదు. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ లో ఫైర్ లా అంటుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలో ఆయన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అయితే అంతకన్నా ముందే కొంతమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు అల్లు అర్జున్ స్టైల్ కు, డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని స్పష్టం చేయగా, తాజాగా మరో బాలీవుడ్ స్టార్ ‘ఆర్య’ సినిమా నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేయడం విశేషం.బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా బన్నీపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also : కరోనాతో ఆసుపత్రిలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్
అర్జున్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫ్యాన్‌బాయ్ మూమెంట్‌ను వ్యక్తం చేస్తూ “పుష్ప: ది రైజ్” నుండి అల్లు అర్జున్ స్టిల్‌ను షేర్ చేశాడు. తాను ఆర్య నుండి అల్లు అర్జున్ కి అభిమానినని వెల్లడిస్తూ “పుష్ప చిత్రం కాదు… ఇది ఒక అనుభవం, కూల్‌నెస్‌తో కూడిన ఒక మృదువైన పోయెటిక్ మోషన్ పిక్చర్. ఒక అభిమానిగా ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ని చూడటం చాలా అద్భుతంగా అనిపించింది… పుష్ప కాదు అది ఫైర్… ” అంటూ ప్రశంసలు కురిపించారు. దీంతో ‘పుష్ప’రాజ్ ఫైర్ బీ టౌన్ లో ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
