కరోనాతో ఆసుపత్రిలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్

ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ మరో నటుడిపై పడింది. ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువ మంది సెలెబ్రిటీలకు కోవిడ్-19 సోకుతుండడం గమనార్హం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలెబ్రిటీలంతా వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు దాదాపు రోజుకు ఇద్దరు ముగ్గురు సెలెబ్రిటీలు చేరిపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, థమన్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్ లతో పాటు తదితర సెలెబ్రిటీలు కరోనా కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కు కోవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన కోవిడ్ చికిత్స నిమిత్తం ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

Read Also : రమేష్ బాబుపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

కాగా రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘సేనాపతి’ అనే వెబ్ సిరీస్ ఇటీవలే ఓటిటిలో విడుదలైంది. ఇదే ఆయన మొదటి ఓటిటి మూవీ. చిత్రబృందంపై మెగాస్టార్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ‘సేనాపతి’గా రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన లుక్ లో కనిపించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ ఫిలింకు దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 31న విడుదలైన ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Related Articles

Latest Articles