Arjun Ambati:అగ్నిసాక్షి సీరియల్ తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తర్వాత అర్జున్ అంబటికి ఒక స్టార్ హీరో రేంజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సీరియల్ కన్నా ముందే అర్జున్ కొన్ని సినిమాల్లో నటించాడు. సీరియల్ తర్వాత పలు షోస్ సినిమాలు చేస్తూనే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా హౌస్ లోపలికి వెళ్లి నిజాయితీగా ఆడి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక క్లిక్ అయినా అర్జున్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. తాజాగా అర్జున్ ఒక ఇంటర్వ్యూలో తన గత స్మృతులను నెమరు వేసుకున్నాడు.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు డైరెక్టర్ కార్తీక్ అర్జున్ అనుకున్నాడట.” డైరెక్టర్ కార్తీక్ నాకు క్లోజ్ ఫ్రెండ్. అతను ఎప్పుడు సినిమానే లోకంగా ఉంటాడు. కార్తీక్ తో కలిసి నేను లూప్ అనే వెబ్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత ఒక మంచి సినిమా చేయాలనుకున్నాము. నిర్మాతలు కోసం రెండేళ్లు తిరిగాము. ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో ఓటిటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా లేకపోవడంతో ఆ సినిమాను ఆపేయాల్సి వచ్చింది. నేను హీరోగా అనుకున్న సినిమాకు కార్తీక్ ముందు శాసనం అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత అదే కథ తేజ్ దగ్గరకు వెళ్లి విరూపాక్షగా రిలీజ్ అయింది. ఈ సినిమా విజయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను హీరోగా చేయలేదు అన్నందుకు బాధ లేదు. ఎందుకంటే నాతో చేసి ఉంటే ఈ సినిమా అంత సక్సెస్ అయి ఉండేది కాదేమో” అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.