Allu Aravnd : శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. శ్రీ విష్ణు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిసారి ఏదో ఒక కొత్త కాన్సెప్టుతోనే సినిమాలు చేస్తూ జనాలను ఎంగేజ్ చేస్తుంటాడు.
Read Also : Raashii Khanna : రాశిఖన్నా అందాల బీభత్సం..
అందుకే సింగిల్ మూవీని తీశాను. అనుకున్నట్టే మూవీ మంచి హిట్ అయింది. సింగిల్ మూవీ ఆడుతున్న థియేటర్ల దగ్గర రష్ చూసి వెంటనే విష్ణును ఆఫీసుకు పిలిచా. బ్రదర్ నువ్వు మా బ్యానర్ లో ఇంకో రెండు సినిమాలు చేయాలన్నాను. చెప్పడమే కాకుండా వెంటనే మంచి ఫ్యాట్ చెక్ ఇచ్చా. ఇద్దరం కలిసి సినిమాలు చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మాట్లాడారు. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.
అతని సినిమాల్లో కామెడీ జనరేట్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. కచ్చితంగా విష్ణుతో భవిష్యత్ లో వర్క్ చేస్తా. కానీ ఎప్పుడు అనేది చెప్పలేను. ప్రతి సినిమాలో విష్ణు పాత్రలో లీనమై పోతున్నట్టు కనిపిస్తాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఎమోషన్ లో కనిపిస్తుంటాడు. అదే అతని ప్లస్ పాయింట్. క్లాస్ సినిమాల్లోనే మాస్ యాంగిల్ ను కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటాడు. అదే నాకు నచ్చుతుంది. మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపాడు అనిల్ రావిపూడి.
Read Also : Naga Chaitanya: చైతూ లుక్ అదిరింది బాసూ