ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తాజాగా వేడుక జరిగింది. ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 2న రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ప్రపంచానికి తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఖతీజా పోస్ట్‌ను పంచుకున్నారు.…
సమంత అతి త్వరలో ఖతీజాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత ఖతీజా లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుండి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ రాంబోగా కనిపించనున్నాడు. రంజన్ కుడి అన్బరసు మురుగేశ భూపతి ఓహూందిరన్ పేరునే షార్ట్ కట్ లో రాంబోగా మార్చారు.…