టాలీవుడ్ స్వీటెస్ట్ హీరోయిన్ అనుష్క శెట్టి గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. ‘నిశ్శబ్దం’ మూవీ తరువాత స్వీటీ ఇంత వరకూ స్క్రీన్ పై కనిపించకపోవడం అభిమానులను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా అనుష్క నెక్స్ట్ మూవీ ఇదేనంటూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడెప్పుడో త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్, కొత్త ప్రాజెక్టులపై అప్డేట్ అంటూ అభిమానులను ఊరించించింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇన్నాళ్లకు అనుష్క తదుపరి చిత్రం గురించి మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. అనుష్క కొత్త సినిమాలో ఊహించని పాత్రలో కనిపించబోతోంది అనే ప్రచారం జరుగుతోంది.
Read Also : Raviteja : మాస్ మహారాజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం
పి మహేష్ దర్శకత్వం వహించనున్న ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం అనుష్క ఈ చిత్రంలో అంతర్జాతీయ చెఫ్ పాత్రను పోషిస్తుంది. కథ వింటున్నప్పుడు పాత్ర నచ్చి వెంటనే సినిమాకు సైన్ చేసిందట అనుష్క. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఈ నెలలో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయనుండగా, మేలో అనుష్క సెట్స్‌పైకి వెళ్లనుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మరోవైపు అనుష్క డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.